ఘనంగా ఎమ్మెల్యేలకు సన్మానం

నవతెలంగాణ బొమ్మలరామారం: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, భారీ మెజార్టీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ బొమ్మలరామారం మండలం ఫక్కీర్ గూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గర్ల భరత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిపాక సాయి ముదిరాజ్ పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గర్ల భరత్ గౌడ్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలకు చెందిన బీర్ల ఐలయ్యకు ప్రభుత్వం ప్రభుత్వ విప్ ఇవ్వడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం భువనగిరి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.