
తెలంగాణ రాష్ట్ర నూతన మత్స్య సహకార సంఘం వైస్ ఛైర్మెన్ గా దివిటీ మల్లయ్య ఎన్నికవడం జరిగింది. కామారెడ్డి జిల్లామత్స్య సహకార సంఘం అధ్యక్షులు శ్రీ దొబ్బల గంగాధర్, జిల్లా డైరెక్టర్లు వారిని శుక్రవారం హైదరాబాద్ లో కలుసుకుని సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దివిటీ మల్లయ్య ని ఎన్నుకోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కృతజ్ఞతలు వ్యక్తం తెలియచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా నేడు హైదరాబాద్ లోని కమిషనర్ కార్యాలయంలో పదవి భాద్యతలు చేపట్టిన శ్రీ దివిటీ మల్లయ్య కు శాలువా మరియు పూలమాల తో సన్మానించారు .ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా సంఘం అధ్యక్షులు శ్రీ దొబ్బల గంగాధర్ మరియు జిల్లా డైరెక్టర్లు గుల సాయిలు,ఎర్ర సాయిలు మైషాబోయ్, మరియు వివిధ గ్రామ సంఘాల అధ్యక్షులు అక్కంగారి రమేష్, బోర్లమ్ రమేష్ ,అంకోల్ పి. సాయిలు, లక్ష్మన్ మైషాబోయి, బరంగెడ్జి సర్పంచ్ రమేష్,పోశెట్టి, దొబ్బల రాములు, తడ్కోల్ గంగారాం తదితరులు పాల్గొన్నారు