మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం

– పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి రామ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత సమావేశం నాందేవ్ వాడలోని సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ మధ్యాహ్న భోటేజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల గౌరవ వేతనం యొక్క పెండింగ్ బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా జిల్లాలో గత ఏడు నెలలుగా గుడ్లు, ఇతర బిల్లులు పెండింగ్ లో ఉండటంతో మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు అన్నారు, వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు, స్కూల్ల ప్రారంభానికి ముందే అడ్వాన్సులుగా మధ్యాహ్న భోజన నిర్వహణకు నిధులు కేటాయించాలని అన్నారు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్, మధ్యాహ్న భోజనం యూనియన్ నాయకులు కొండ గంగాధర్, సుజాత, నిరంజన, బాలరాజు, శిరీష, సురేందర్ రెడ్డి, పర్వవ్వ, తదితరులు పాల్గొన్నారు.