గౌడ సంఘం ఆధ్వర్యంలో నుడా చైర్మన్ ఈగ. సంజీవరెడ్డికి సన్మానం

నవతెలంగాణ-మోపాల్ : మోపాల్ మండల గౌడ సంగం ఆధ్వర్యంలో సోమవారం నూడా చైర్మన్ స్వగృహం లో ఘనముగా సన్మానించారు. అలాగే ఎం యల్ ఎ నిధుల నుండి గౌడ సంఘా కమ్యూనిటీ భావననిర్మాణానికి 5 లక్ష ల ప్రొసీడింగ్ కాపీ ఎం ఎల్ ఎ చేతుల మీదుగా క్యాంప్ ఆఫీస్ లో తీసుకోవడం జరిగింది. అందుకు గాను నిధులు గౌడ సంఘానికి ఇప్పించి నందుకు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఈగ సంజీవ రెడ్డి కి మోపాల్ గ్రామ గౌడ సంఘము తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బి అర్ ఎస్ నాయకులు సతీష్ రెడ్డి, మోతే గంగాధర్ గౌడ్, దత్త గౌడ్, ఎల్లా గౌడ్, రాజేశ్వర్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, రామగౌడ్, గంగాధర్ గౌడ్, BRS యువనాయకుడు సయ్యద్ నాభి తదితరులు పాల్గొన్నారు.