పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి..

– సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు దాస్
నవతెలంగాణ ఆర్మూర్ :పేదల ఇళ్ల స్థలాల పట్టాల ఇవ్వాలని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు దాస్ అన్నారు. మామిడిపల్లిలో పేదలు నిర్మించుకొని ఉన్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని ఆర్మూర్ తాసిల్దార్ శ్రీకాంత్ సీపీఐ(ఎం) న్యూడెమోక్రసీ బృందం కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్, అంకాపూర్ తన నివాసంలో కలిసి మామిడిపల్లి పేదల ఇండ్ల స్థలాల పట్టాల విషయం చర్చించడం జరిగింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆర్మూర్ తాసిల్దార్  న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ కలెక్టర్ మా దృష్టికి తెచ్చారు. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల అనంతరం మామిడిపల్లి పేదల ఇండ్ల స్థలాల పట్టాల సమస్యను పరిష్కరిస్తామని ఆర్మూర్ తాసిల్దార్ గారు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు కాగానే వెంటనే మా పేదలకు పట్టాలు ఇచ్చి అండగా నిలవాలని డివిజన్ కార్యదర్శి అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు. పేదల కోసం పోరాడి ఆక్రమించుకున్న భూముల జోలికి డబ్బు ఉన్న వాళ్ళు వస్తే ఉరికినేది లేదని ఆయన అన్నారు. అనవసరంగా కాలనీలో సమస్యలు సృష్టించ వద్దని దాసు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు  సూరిబాబు, ఎస్ వెంకటేష్, ఆలీంబాయి, మగ్ధుమ్ పటేల్ , శివకుమార్, లతీఫ్, ఇర్ఫాన్ హైమది, ఎం లక్ష్మి, గంగక్క, సుజాత, తదితరులు పాల్గొన్నారు.