– బస్సు పాసుల కోసం సొంతగా డబ్బులు చెల్లిస్తా..
– ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
దివ్యాంగులకు ఎంత చేసిన తక్కువేనని వారు ఇబ్బందులు పడొద్దు అనే సదుద్దేశంతో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వెయ్యి రూపాయలు పెంచి 4వేల రూపాయల పెన్షన్ ప్రతినెల అందజేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూణపడి ఉండాలని, బస్సు పాసు కోసం అయ్యే ఖర్చులను తాను స్వతహగా బరిస్తారని, గతేడాది సైతం దాదాపు 4లక్షల రూపాయలను నిజామాబాద్ రూరల్ నీయేజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు సంబంధించిన డబ్బులను చెల్లించడం జరిగిందని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.బుదవారం సాయంత్రం ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా దివ్యాంగులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు 4016 పెన్షన్ అందజేస్తున్నామని, ఇదే కాకుండా బస్సులలో 50% రైతుతో రాకపోకలు కొన్ని బస్సులకే పరిమితం ఉన్నాయని అన్ని బస్సులకు వర్తింపజేసే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. బిజెపి పార్టీ ఎలాంటి ఫ్రీ సబ్సిడీలు ఇవ్వవద్దని ఇతరులకు చెప్పుతూ ఉందని అదే 15 లక్షల కోట్లు బ్యాంకులో నుండి అప్పు తీసుకొని ఎగు గొట్టి పారిపోయిన వారు గుజరాత్ చెందిన బిజెపి నాయకులు ఉన్నారని వారికి ఎంత ఇచ్చిన తక్కువే నాని బిజెపి వాదన ఉందన్నారు. ఇలాంటి వాళ్లు మనకు అవసరమా అని ప్రశ్నించారు. దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం కన్నగిల్లా ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చూపుతున్నారని 21 రోజుల కార్యక్రమం లో భాగంగా ప్రజల మధ్యనే ఉండాలని తమకు హెచ్ఎమ్, బాస్ కెసిఆర్ సూచించిన విధంగానే అనునిత్యం ప్రజల మధ్య లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కోట్లాది రూపాయలు వెచ్చించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న మన్నారు. దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా మండల కేంద్రాల్లో అవసరమైతే గ్రామాల్లో సైతం క్యాంపులు పెట్టి వారికి సర్టిఫికెట్లు అందజేసే విధంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ తో త్వరలోనే మాట్లాడి సమస్య ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దివ్యాంగులకు చూస్తే ఎంతో బాధేస్తుందని వారి బాధలను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా చర్చీలు ఆలయాలు మస్జిద్లలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టినట్లు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాబోవు రోజుల్లో ఇతర పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. అనంతరం దివ్యాంగుల నిజామాబాద్ రూరల్ జాగృతి అధ్యక్షులు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు అతిధులకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, ఎంపిటిసి మారంపల్లి సుధాకర్, చింతల దాస్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, మోహన్ నాయక్, నరేష్,చందర్ నాయక్, బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలివేరి గంగాదాస్, సీనియర్ నాయకులు పాశం నర్సింలు, పాశం కుమార్, అరటి రఘు, సహకార సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి మోచ్చే గోపాల్, దాస్, తాసిల్దార్ టీవీ రోజా, మండల రెవెన్యూ అధికారి మోహమ్మద్ వాహిద్, తో పాటు ఆయా గ్రామాలకు చెందిన దివ్యాంగులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు 50% రైతులతో కూడిన బస్సు పాసులను దివ్యాంగులకు అందజేశారు. రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి 25వేల ఆర్థిక సహాయంను బాధ్యత కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.