బీపీ కంట్రోల్‌ ఎలా?

బీపీ కంట్రోల్‌ ఎలా?కొందరు ఉప్పును తగ్గించి తింటారు.. కొందరైతే అసలు ఉప్పే వాడరు. ఏ కొంచెం తిన్నా ఎక్కడ బీపీ పెరిగిపోతుందో అన్న భయంతో తినరు. అయితే.. బీపీ పెరగడానికి ప్రధాన కారణం జీవన శైలి. వేళకు తినకపోవడం, ప్రతీ చిన్న విషయానికి అతిగా రియాక్ట్‌ కావడం, సరిగా నిద్రపోకపోవడం, అధిక భావోద్వేగాలు బీపీని పెంచుతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి బీపీకి దారితీస్తుంది. అలాగే అస్తవ్యస్థ తిండి అలవాట్లు, సిగరెట్లు, మద్యం కూడా ఒక కారణం.
ఇలా చేయండి
– ప్రస్తుత పరిస్థితుల్లో 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ బీపీని ప్రతీ 3 నెలలకు ఒక సారి చెక్‌ చేయించుకోవాలి.
– రక్తపోటు అధికంగా ఉంటే డాక్టర్‌ సహాయం తీసుకుని తగిన చికిత్స తీసుకోవాలి.
– ఒక వేళ బీపీ ఉందని తేలితే జీవన శైలిలో తగిన మార్పులు కచ్చితంగా చేసుకోవాల్సిందే.
– కచ్చితంగా నడక లేదా వ్యాయామం చేయాలి.
– మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి.
– ధ్యానం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
– ఎప్పటికప్పుడు బీపీ ని చెక్‌ చేసుకుని, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ పెరగకుండా చూసుకోవాలి.
ఇవి తగ్గించండి
– అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
– చక్కెర వినియోగాన్ని కూడా తగ్గిస్తే మంచిది.
– సిగరెట్‌, మద్యపానం అలవాటు ఉంటే మానేస్తే మంచిది.