– ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పంటలను దెబ్బతీస్తున్న కోతులను తక్షణం కట్టడి చేయాలఁ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికఁమారి అధికారుల్ని ఆదేశించారు. సోమవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆమె ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. దీఁకి సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకఁ సమావేశం ఁర్వహించినట్టు ఆమె తెలిపారు. కోతుల్ని పట్టుకొనే ఏజెన్సీల ప్రతిఁధుల కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీఁకి సంబంధించి ఁపుణుల కమిటీ సభ్యులు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికల్ని సీఎస్‌కఁ అందచేశారు. ఆ ప్రణాళిక ప్రకారం క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలఁ ఈ సందర్భంగా సీఎస్ అధికారుల్ని ఆదేశించారు.సమావేశంలో పీసీపీఎఫ్ ఆర్‌ఎమ్ డోబ్రియాల్, పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కఁమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గ్రేటర్ హైదరాబాద్ ముఁ్సపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.