హైదరాబాద్ : ఆఫ్రికా విద్యుత్ ట్రాన్స్‌మిషన్‌లో భారీ కాంట్రాక్ట్ దక్కినట్లు సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఎస్‌టిఇఎల్) వెల్లడించింది. భారీ ఉక్కు నిర్మాణాల తయారీలో ఉన్న సలాసర్ టెక్నో టెలికాం, పవర్, రైల్వేలు మరియు ఇతరాలతో సహా విభిన్న శ్రేణీ పరిశ్రమలకు కావాల్సిన ఉక్కు నిర్మాణాలు, ఇపిసి సొల్యూషన్లను అందిస్తుంది. తాజాగా 110 కెవి ట్రాన్స్‌మిషన్ లైన్ ఏర్పాటు కోసం రువాండలోని ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి 9.40 మిలియన్ డాలర్ల (రూ.75.23 కోట్లు) కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నట్లు వెల్లడించింది. ఆఫ్రికన్ రీజియన్‌లోని రులిండో-గికుంబి ట్రాన్స్‌మిషన్ లైన్‌ను 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది.