తాడ్వాయి నుండి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు

– జన బలమే తన బలంగా ముందుకు సాగుతున్న ‘జ్యోతక్క’
నవతెలంగాణ -తాడ్వాయి
సీఎం కేసీఆర్‌ సంక్షేమ ఫలాలు, అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ గా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, అందులో భాగం గా బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో జెడ్పీ చైర్మన్‌, ములుగు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి సమక్షంలో మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వాసులు దాదాపు 70 కుటుంబాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని బడే నాగజ్యోతి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదని, కేసీఆర్‌ నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. ఆత్మ చైర్మన్‌ రమణయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు బంగారు సాంబయ్య, నాయకులు పిన్నింటి యాదిరెడ్డి, బంగారు శ్రీరాములు, బిఆర్‌ఎస్‌ శ్రేణులు మంతెన శీను, నాగరాజు, నరేష్‌, ప్రవళిక, స్వరూప, లక్ష్మి, ఉప సర్పంచ్‌ ఇంద్రారెడ్డి గంటా మనోజ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆశీస్సులు ఉండాలి
ఏటూరునాగారం ఐటీడీఏ : ప్రజల ఆశీస్సులు తనపై ఉండాలని తనకు ఓటు వేయా లని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తెలిపారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ స్థలంలో కొనసాగుతున్న దేవీ నవరాత్రుల ఉత్స వాల్లో భాగంగా కమిటీ సభ్యులు బుధవారం దుర్గామాతను లక్ష్మీ అవతారంలో కనిపించే వి ధంగా ఏర్పాట్లు చేశారు. కాగా ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మీనరసింహారావుతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొన్ని వాడల్లో ఇం టింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌ బాబు కూడా నాగజ్యోతికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువలో ఉంటా యని అన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపుతోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.