భారీగా తగ్గిన వంటగ్యాస్ ధర

నవతెలంగాణ- కంటేశ్వర్
ఎల్పిజి వంటగ్యాస్ సబ్సిడీ రాయితీ సిలిండర్ ధరను ఈనెల అనగా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించిందని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు మాయావార్ రాజేశ్వర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. గతంలో వంటగ్యాస్ ధర 1178 రూపాయల యాభై పైసలు ఉండగా ప్రస్తుత ధర 978 రూపాయల 50 పైసలకు ఉందని రాజేశ్వర్ తెలిపారు వినియోగదారులు వినియోగదారులు నేరుగా గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి గ్యాస్ బండను తీసుకుంటే 19 రూపాయల 50 పైసలు తగ్గించి 959 రూపాయలకు వినియోదారులకు అందించాలని గ్యాస్ డీలర్లను కోరుతున్నాను గ్యాస్ ఏజెన్సీ డీలర్లు ఎక్కువ డబ్బులు అడిగితే సంబంధిత అధికారులకు జిల్లా పౌరసరఫరాల అధికారులకు ఫిర్యాదు చేయాలని వినియోగదారులను కోరుతున్నాను.