నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎన్‌ఐఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ), హైదరాబాద్ అండ్ స్మార్ట్ జీసీ ప్రో ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలిసారిగా హైబ్రిడ్ ఏవియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గ్లోరీ స్వరూప తెలిపారు. గురువారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరు నెలల కాలవ్యవధి డిప్లొమా శిక్షణ ద్వారా ఏవియేషన్ పరిశ్రమలో గ్రౌండ్ క్రూ ప్రొఫెషనల్స్‌ను తయారు చేస్తామన్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులనీ, 2023 జులై 15 అడ్మిషన్లకు తుదిగడువు అని వివరించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. తదనంతరం ఏవియేషన్ పరిశ్రమలో విస్త్రుత ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ సునీష్ తదితరులు పాల్గొన్నారు.