నవతెలంగాణ- కంఠేశ్వర్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాదు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ప్రభుత్వ బాలికల పాఠశాల కస్బాగల్లీలో విద్యార్థులకు హైజీన్ కిట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2500 హెల్త్ హైజిన్ కిట్స్ అందజేయడం జరిగింది. ప్రతి విద్యార్థిని కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చిన్నప్పటినుంచి సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలి సమాజానికి తోచిన సహాయం చెయ్యాలని తెలిపారు. నిజామాబాదు డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం పిల్లల వైద్యులు విద్యార్థులకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండాలని మన ఆరోగ్యం మన చేతిలో ఉందని విద్యార్థులకు సూచించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఏ విధంగా ప్రారంభమైంది రెడ్ క్రాస్ సేవలను గురించి తెలుపుతూ మీ అన్నయ్యలు నాన్నల తో రక్తదానాన్ని చేయించాలని సూచించారు. జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, నిజామాబాద్ అర్బన్ చైర్మన్ నరాల సుధాకర్, డివిజన్ వైస్ చైర్మన్ లక్ష్మి నారాయణ మరియు పాఠశాల యాజమాన్యం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.