నవతెలంగాణ – మాక్లూర్: వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డిని ఓడించి పడగొట్టేది నేనేనాని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి పొడ్డుతురి వినయ్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొత్తపల్లి, గుంజిలి, చిక్లి, వల్లభాపూర్, మెట్ పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి గడప గడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి ఇంటికి తిరుగుతూ తనకు ఒక్క సరి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారని దాని వల్ల గ్రామాల్లో ఎక్కడ కూడా అభివృద్ది జరుగలేదని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, అర్హులకు పించాన్, రేషన్ ఇవ్వలేదని, ప్రతి గ్రామంలో అర్హులకు ఇండ్లు కటిస్తనని హామీ ఇచ్చారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్దే కనిపిస్తుందని, బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు కనిపించడం లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచే అరు పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక్క సారి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, జిల్లా నాయకులు డేగ పోషేట్టి, గంగాధర్ గౌడ్, పీర్ సింగ్, పురుషోత్తం, విఠల్, కృష్ణ రావు, శేకర్, జైల్ సింగ్, భారత్, మైనార్టీ మండల అధ్యక్షులు ఆలిం, సందీప్, దోర్త రాజేందర్, మాజీ ఎంపిటిసి బోజన్నా, అరుణ్, రంజాన్, రమేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు కాంగ్రెస్ లోకి చేరిక మండలంలోని సింగిల్ విండో మాజీ చైర్మన్, ప్రస్తుత డైరెక్టర్ దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆర్మూర్ అభ్యర్థి వినయ్ రెడ్డి సమక్షంలో కండువా వేసుకొని చేరారు. ఆయనతో పాటు సుమారు 20 మంది యువకులు పార్టీలో చేరారు.