నవతెలంగాణ- బోధన్ టౌన్
బోధన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద పెంటఖర్దు సొసైటీ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హస్తకళల చైర్మన్ అమర్నాథ్ బాబు అతని వ్యవసాయ క్షేత్రంలో మీడియాతో మాట్లాడుతూ.. బోధన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ప్రజల్లోకి వెళ్తానన్నారు. ఒక్కొక్కరి ఆలోచనా ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మరో మహా ప్రస్థానం కి నాంది కావాలి అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా రంగంలోకి దిగాలన్న ఆలోచన ఉందని తెలిపారు. అందరి బాగు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. బోధన్ నియోజకవర్గం అభివృద్ధి కోసం వినియోగపడాలి. అయితే 4 దశాబ్దాలు పడిన కష్టంతో ప్రజల అండతో ఎదిగి ప్రజలమదిలో ఒదిగి సత్ఫలితం సాధించాలన్నదే అన్నరు. నా సంకల్పం ప్రజల్లో నా నిజాయితీ, అంకితభావంతో పనిచేసేతత్వం మీకు తెలుసు. ప్రతి క్షణం, ప్రతి చెమట బొట్టు, ప్రతి రక్తం చుక్క మీకు ఉపయోగపడాలన్నదే నా దృఢ సంకల్పం. అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు, వసతులు బోధన్ లో ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే దశాబ్ది కాలంలో బోధన్ యూరప్, అమెరికా దేశాల జీవన స్థితిగతులు ఉండేలా అభివృద్ధి చేయవచ్చు. నా అనుభవం, శక్తియుక్తులే కాదు అవసరం అయితే ప్రాణాలను సైతం లెక్కపెట్టక అంకిత భావంతో పనిచేసే ధైర్యం నాది. ఆత్మ గౌరవం నిలబడాలి. సమాజంలో మనందరం తల ఎత్తుకుని సగర్వంగా ముందుకెళ్ళాలి. మీ నిర్ణయమే నాకు శిరోధార్యం. అంతిమ నిర్ణయం మీదే. ఈ యజ్ఞం ఫలాలు చేరాల్సింది మికే. మన బోధన్ నియోజక వర్గానికే. పది రోజుల్లో ఎక్కువగా కార్యరూపాన్ని కలుపుతానని తెలిపారు. ప్రజల అభిప్రాయాల మేరకే బోధన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.