నవతెలంగాణ- ములుగు/కన్నాయిగూడెం
నేను మీ ప్రభాకర్ అన్న బిడ్డను. ప్రభాకర్ అన్న మీ అభీష్టం మేరకే మీ సేవలో ప్రాణాలు అర్పించాడు. మీ ప్రభాకర్ అన్న ప్రాణంగా ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. నిస్వార్ధంగా మీకు సేవ చేసేందుకు వచ్చాను. నన్ను గెలిపించి సాదుకుంటారో లేదా సంపుకుంటారో మీ ఇష్టం. నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. కాంగ్రెస్ నాయకుల్లాగా నాకు ఛత్తీస్‌ఘడ్‌లో కాంట్రాక్టు లేవు. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా” అని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం తుపాకులగూడెం, లక్ష్మీపురం, దేవాదుల, రాజన్నపేట, కన్నాయి గూడెం, గురేవుల, ముప్పనపల్లి, బుట్టాయిగూడెంలలో నాగజ్యోతి ఎన్నికల ప్ర చారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు పగటి వేషగాళ్లు ఆరు గ్యారంటీలతో వస్తున్నారని, వాళ్ళ మాయమాటలు నమ్మవద్దన్నారు. పక్క రాష్ట్రంచత్తీస్‌ఘడ్‌లో రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి తదితర పథకాలు లేవని, అలాంటివారు తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారన్నారు. చత్తీస్‌ఘడ్‌లో కేవలం రూ.500లు మాత్ర మే పెన్షన్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభు త్వం మూడోసారి అధికారంలోకి రాగానే రూ.3000 ఇచ్చేం దుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల్లో గెలవ గానే ఇల్లు లేని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అధికార పార్టీ లో ఉంటేనే అభివృద్ధి సాధ్యమైతుందనారు. గిరిజనేతరులకు కూడా పోడుప ట్టాలతో పాటు అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిం చేందుకు మేనిఫెస్టోలో ఈఅంశాన్ని పొందు పరిచినట్లు గుర్తు చేశారు. కన్నాయిగూడెం మండల కేంద్రంలో ప్రజల అభీష్టం మేరకు బ్యాంకు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరి నదీ జలాలతో ఈ ప్రాంతం భూములకు పూర్తిస్థాయిలో తాగు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు.