నవతెలంగాణ పెద్దవంగర: బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్ కుమార్ అన్నారు. గురువారం రామచంద్రు తండాకు చెందిన జాటోత్ శంకర్ (52) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని చెప్పారు. వారి వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాటోత్ హేమాని, మాజీ ఎంపీటీసీ జాటోత్ వెంకన్న, జాటోత్ రమేష్, జాటోత్ సుధాకర్ తదితరులు ఉన్నారు.