ఐసిసి వన్డే

ICC ODI– ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు
దుబాయ్: ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు ముందు భారతజట్టు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఇంగ్లండ్‌, నెదర్లాండ్స్‌ జట్లతో ఈ రెండు వార్మప్‌ మ్యాచ్‌ లు ఆడనుంది. గౌహతి, తిరువనంతపురం వేదికల్లో ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండుసార్లు ప్రపంచకప్‌ విజేత భారత్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 30న గౌహతిలోని బర్సపర క్రికెట్‌ స్టేడియంలో ఆడనుంది. ఇక అక్టోబర్‌ 3న నెదర్లాండ్స్‌తో తిరువనంతపురం వేదికగా మరో వార్మప్‌ మ్యాచ్‌ను ఆడనుంది. అనివార్య కారణాలవల్ల ఏదైనా వార్మప్‌ మ్యాచ్‌ ఆ వేదికలో ఆడని పక్షంలో హైద రాబాద్‌ను వార్మప్‌ మ్యాచ్‌ తటస్థ వేదికగా ఎంపిక చేసినట్లు ఐసిసి ఆ ప్రకటనలో పేర్కొంది. ఇక సెప్టెంబ ర్‌ 29న బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య గౌహతిలో, దక్షిణాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య తిరువనంతపురం, న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య హైదరాబాద్‌ వేదికగా వార్మప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.