
రెంజల్ మండలం నీల గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీలరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోషణ మాసంలో భాగంగా చిన్నారులకు, గర్భిణి బాలింత మహిళలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. ఆకుకూరలు పై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ముర్రు తాగించాలని ఆమె సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో ట్రీ గార్డెన్ ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబం తమ పెరట్లో ఆకుకూరలను పండించుకోవాలని ఆమె సూచించారు. చిరుధాన్యాలతో చిన్నారులకు జావా (అంబలి) తయారుచేసి తినిపించారు. జొన్న పిండి రాగుల పిండిలో బెల్లం కలిపి జావా తయారుచేసి చిన్నారులకు తినిపించారు. పరువు తక్కువ గల పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడి టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాజశ్రీ, ఆయా తదితరులు పాల్గొన్నారు.