మండల కేంద్రంలో అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన ఐసిడిఎస్ సూపర్వైజర్..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి చిన్నారులకు, గర్భిణీ బాలింత మహిళలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా పౌష్టికారాన్ని అందజేయాలని ఆమె అంగన్వాడి టీచర్ను ఆదేశించారు. బరువు ఎత్తులను కొలిచి వారికి పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. తల్లులకు పౌష్టిక ఆహారం కోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుందని ఆమె వారికి సూచించారు. ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. తమ ఇంటి ముందర పెరట్లో స్వయంగా సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించుకోవాలని ఆమె తలులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి, చిన్నారులతోపాటు గర్బిని బాలింత మహిళలు పాల్గొన్నారు.