ఆదర్శ కమ్యూనిస్టు లక్ష్మీదాస్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కార్మికోద్మమ నాయకుడు, మాజీ ఎంపీ కామ్రేడ్‌ పి లక్ష్ష్మీదాస్‌ ఆదర్శ కమ్యూనిస్టు అని సీపీఐ(ఎం) మాజీ నగర కార్యదర్శి జి. రఘుపాల్‌ అన్నారు. కార్మిక ఉద్యమనిర్మాణంలో ఆయన ప్రశంసనీయమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. మంగళవారం ఎస్‌వీకేలో లక్ష్మీదాస్‌ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) మాజీ నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి, ఎస్‌వీకే మేనేజింగ్‌ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌, కమిటీ సభ్యులు జి బుచ్చిరెడ్డి, ఎస్‌వీకే సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగం కార్మికులతోపాటు ఎన్‌ఎంఆర్‌ , వర్క్‌చార్జిడ్‌ కార్మికుల కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఎస్‌వీకేలో ఆయన పేరుతో క్లినిక్‌, లాబోరేటరీ నడుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అట్టడుగు ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని సిబ్బందికి సూచించారు.