దేశం అభివృద్ధి కావాలంటే వ్యవసాయం అభివృద్ధి కావాలి

– భారత వ్యవసాయ రంగానికి ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు మరువలేనివి,
– విత్తన రంగంలో నిరంతరం పరిశోధనలు జరగాలి,
– కేరళ తరహాలో కింటాకు 700 రూపాయలు బోనస్ ఇవ్వాలి,
– ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ స్మారక సెమినార్ లో అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు  సారంపల్లి మల్లారెడ్డి.
 నవ తెలంగాణ-సూర్యాపేట:
 భారత వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సేవలు మరువలేనివని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సిపిఐఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ స్మారకార్థం” భారత వ్యవసాయ రంగం – స్వామినాథన్ సిఫారసులు”  అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2014, 2018 ఎన్నికల సందర్భంగా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో  స్వామినాథన్ సిఫారసులను దేశంలో అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.  స్వామినాథన్  దేశంలో ఉన్న రైతుల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు చేశారని అన్నారు. చేసిన పరిశోధనలకు గాను  అవార్డులు వచ్చాయన్నారు.దేశం అభివృద్ధి కావాలంటే వ్యవసాయం అభివృద్ధి కావాలని అప్పుడే దేశం అభివృద్ధి అవుతుందని అన్నారని అన్నారు. రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలని అనేక సిఫారసులు చేశారని పేర్కొన్నారు. దేశంలో ఉన్న మహిళా రైతుల అభ్యున్నతి కోసం కుటుంబ స్త్రీ పథకం అమలు చేయాలని స్వామినాథన్ సిఫారసు చేశారన్నారు. వ్యవసాయ రంగంలో యువతను ప్రోత్సహించాలని స్వామినాథన్ సూచించారని తెలిపారు. విత్తన ఏర్పాటు సంస్థగా భారతదేశం అభివృద్ధి కావాలని నిరంతరం ఆకాంక్షించారని  అన్నారు. విత్తన రంగంలో వస్తున్న మార్పులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిశోధనలు జరపాలని డిమాండ్ చేశారు. దేశంలో 1991 నుండి పీవీ నరసింహారావు, 1994 నుండి డెంకల్ లు ప్రవేశపెట్టిన సరళీ కరణ ఆర్థిక విధానాలు, ప్రతిపాదనల వల్ల దేశంలో సంస్కరణలు వేగవంతం అయ్యాయని  దాని మూలంగా రైతాంగం అనేక సబ్సిడీలను కోల్పోయిందన్నారు. ప్రతి కుటుంబానికి 53 ఎకరాల భూమికన్నా ఎక్కువగా ఉండకూడదని చట్టం చెబుతుంటే పాలకులు ట్రస్టుల పేరుతో వేలాది ఎకరాల భూములను తమ గుప్పెట్లో ఉంచుకొని అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశంలో భూ సంస్కరణలు అమలు చేసి భూమిలేని పేదలందరికీ  ఒక ఎకరం భూమి ఇవ్వాలని సిఫారసు చేశారని అన్నారు. ఆ సిఫారసు లను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కయని విమర్శించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల మూలంగా దేశంలో అనేక మంది రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 16 వేలమంది రైతులు ఈ సంవత్సరంలో చనిపోయారని తెలిపారు. ఇందులో 6000 మంది రైతులు  ఆత్మహత్య చేసుకున్నారని, 700 మంది రైతులు విద్యుత్ ప్రమాదం మూలంగా చనిపోయారని పేర్కొన్నారు. మిగతా రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక తెచ్చిన అప్పులు తీరక చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతంగం పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం  చెందాయని విమర్శించారు. సిపిఐఎం  నేతృత్వంలోని కేరళ వామపక్ష ప్రభుత్వం మద్దతు ధర తో పాటు 700 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తుందన్నారు. కౌలు రైతులకు రైతు బీమా, రైతుబంధు వర్తింపజేయాలని  డిమాండ్ చేశారు. రైతాంగం తీసుకున్న అన్ని రకాల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కోరారు. కార్పొరేట్ శక్తులకు లాభం జరిగే చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటు న్నాయని రానున్న ఎన్నికల్లో రైతాంగం బిజెపి, బి ఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమ్మెస్ స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన మరణాన్ని చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో  తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభనాయక్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, బుర్రి శ్రీరాములు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు జిల్లపల్లి  నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, మేకనబోయిన సైదమ్మ, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, మడ్డి అంజిబాబు,కొప్పుల రజిత, దేవరం వెంకటరెడ్డి, పల్లె వెంకట్ రెడ్డి, షేక్ సైదా, దుగ్గి బ్రహ్మం,కాసాని కిషోర్, కందాల శంకర్ రెడ్డి, గుమ్మడవెల్లి ఉప్పలయ్య, మేకనబోయిన శేఖర్ , స్టాలిన్ రెడ్డి, వజ్జా శ్రీనివాస్, పోషణ పోయిన హుస్సేన్, అవిరే అప్పయ్య, చిన్నపoగా నరసయ్య, ఎం. రాంబాబు, పులుసు సత్యం, చందా చంద్రయ్యతదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-02 18:09):

do cbd gummies Rpx work for sex | how much ehH do cbd gummies to quit smoking cost | deep 0zT relief cbd gummies | charles x2N stanley cbd gummy bears | cbd gummies for aVK pain omaha | cbd smilz cbd oil gummies | keoni cbd gummy l08 reviews | remedy free shipping cbd gummies | what are cbd gummy drops for gBL | just prw live cbd gummies | empire extracts cbd edible fHn gummy drops | can my dog njv eat cbd gummies | kRA but cbd gummy bears wholesale | ia cKl 11 grams og cbd ool gummies too much | cbd gummies iFw while fasting | cbd gummies with Rn3 no thc for anxiety | cbd V05 with melatonin gummy | wana cbd genuine gummie | xD2 whole life cbd gummy bears | tko gummies cbd GR4 infused | cbd gummy deals for sale | five cbd 6oF gummies reviews reddit | reliva cbd gummies h2E review | cbd T5X thc gummies dc | cbd cbd vape gummies guide | living n5U tree cbd gummies reviews | dosist cbd for sale gummies | do cbd gummies 61R help you quit smoking cigarettes | cbd gummies buy online uk 0YM | platinum cbd gummies 1000mg ERV | are just Xt1 cbd gummies gluten free | cbd gummies pure hDk organic hemp extract | cbd gummies are they JvA legal | cbd gummies how long BcB for effect | kid safe 93f cbd gummies | OPN can tsa detect cbd gummies | hillstone hemp cbd gummies LQb cost | OmP twisted up cbd gummies | sour vgR cbd oil gummies | cbd big sale pet gummi | dosage for cbd gummies D3y | cbd gummies quit smoking reviews dbi | doctor recommended hypertension cbd gummies | cbd gummies E4Y to detox lungs | Mco pur balance cbd gummies | cbd online sale gummies diabetes | 100 0Hv mg cbd gummies effect | cost of oros cbd AcN gummies | cbd gummies Toz spam texts | just cbd gummies 1000mg UQO best price