కల నిజం చేస్తే కళ

నీవు నిద్దుర లేవలేదని
సూర్యుడు ఉదయించక మానునా
కళ్ళు మూసుకున్నంతన
ప్రపంచం చీకటిమయమవుతుందా!

గడియారపు ముళ్ళు వెనక్కి జరుపుతే
కాలం తిరోగమనం చేస్తుందా
దారిలో అవరోధాలున్నాయని
ప్రయాణం ఆపడం ఆమోదమా!

పడిపోతానేమో అనుకుంటే
పక్షి పైకి ఎగురగలదా
ప్రయత్నం మానుకుండా పనిచేస్తే
ఫలితం చేతికి అందిరాదా!

పై పై చూపులు కాదు
గర్భంలోనే నిధులుంటాయి
చమట చుక్క చిందకుండా
శ్రమ విజయమై నిలుస్తుందా!

నవ్వుతారు జనాలు ఏరుకో
నీ జీవితాన పువ్వులవుతాయి
నిందలు వేస్తారు కాచుకో
అందలమెక్కడానికి మెట్లవుతాయి!

నేలమీద పడ్డానని విత్తనం
నిచ్చేతనమైతే మట్టిలో కలుస్తది
చైతన్యంతో మొలకెత్తితే
చెట్టు అయి నిలుస్తుంది!

పూయడం సష్టి ధర్మం
కాయ అవుతుందో కాదో కాల నిర్ణయం
నిధ్దురలో కనేది కల
నిజం చేస్తే అది కళ !
– జగ్గయ్య.జి, 9849525802