డిన్నర్‌ ఆలస్యమైతే?

 రెండు గంటల గ్యాప్‌ ఉండటం చాలా ముఖ్యం. భోజనం తిన్నవెంటనే నిద్రపోతే.. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అందుకే సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో డిన్నర్‌ పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ సమస్యలు…
రాత్రిపూట మన ఆహార అలవాట్లు.. జీర్ణక్రియపై ఎఫెక్ట్‌ చూపుతాయి. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే.. డైరెక్ట్‌గా వెళ్లి పడుకుంటాం. భోజనం చేసిన తర్వాత ఎలాంటి యాక్టివిటీ ఉండదు. దీని వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్‌, ఇతర జీర్ణవ్యవస్థ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
బరువు పెరుగుతారు..
రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తే.. బరువు పెరిగే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల.. శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. జీవక్రియ నెమ్మదిగా ఉంటే.. కేలరీలు సరిగ్గా బర్న్‌ కావు, శరీరంలో ఫ్యాట్‌ పెరగడం ప్రారంభమవుతుంది.
బీపీ పెరుగుతుంది..
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల బీపీ, డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రి డిన్నర్‌ ఆలస్యంగా తింటే.. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయి. రక్తంలో కొవ్వును పెంచుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం మరింతగా పెరుగుతుంది.
నిద్రలేమి సమస్య..
రాత్రిపూట నిద్రసరిగ్గా రావడం లేదని.. చాలా మంది కంప్లైంట్‌ చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం.. రాత్రిపూట ఆలస్యంగా తినడం. డిన్నర్‌ లేట్‌గా తింటే.. ఆహారం సరిగ్గా జీర్ణం కాక నిద్ర కూడా సరిగా పట్టదు.