
నవతెలంగాణ- నసురుల్లాబాద్ : దళితుల భూములను ఆక్రమించుకున్నట్టు నిరూపిస్తే.. ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటానని, బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగుల రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సవాల్ చేశారు. మంగళవారం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగుల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మాలాద్రి రెడ్డి తో కలిసి నసురుల్లాబాద్ బుధవారం మీడియాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్ పోచారం సీనియర్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం భూమి కబ్జా దారుడు అని ఆరోపణ చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. దమ్ముంటే పచ్చిబట్టలతో నీవు నమ్మే బీర్కూర్ శివారులోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఎక్కుదామని, ఏనుగుల రవీందర్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డికి సవాల్ చేశారు. కొండపై ఎక్కితే నీ అక్రమాలు ఎన్నో,. నా అక్రమాలు ఎన్నో చేసిన తప్పు బయట పడుతాయని అన్నారు. దళితుల కు సంబంధించిన ఒక్క గుంట భూమైన తాను కబ్జా చేసుకున్నట్లు నిరూపిస్తే
ఇక రాజకీయం నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈ సందర్భంగా వెల్లడించారు.. బాన్సువాడ నియోజకవర్గం లో ఈ 25 ఏళ్ల కాలంలో నీవు చేసిన అవినీతి అక్రమాలు
చిట్టా తన వద్ద ఉందని, అవసరం వచ్చినప్పుడు దానిని ప్రజాక్షేత్రంలో పెట్టి మిమ్మల్ని. ప్రజా క్షేత్రంలోకి లాగుతాన్నారు. ఈనెల 30న . జరగబోయే ఎన్నికల సందర్భంగా ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, శాసనసభాపతిగా విధులు . నిర్వహించిన నీవు నియోజకవర్గం ఒక్క పరిశ్రమమైన తెచ్చి పెట్టావా? అంటూ ప్రశ్నించారు. జరగబోయే ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందన్నారు అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు నందు పటేల్ సీనియర్ నాయకులు ప్రతాప్ సింగ్ భాస్కర్ రెడ్డి రామకృష్ణారెడ్డి యూసుఫ్ శివ ప్రసాద్ తుం సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.