ప్రజలకు మంచి చేస్తునట్టుగా కనిపించే ప్రభుత్వాలు, అవి సంకల్పించిన పథకాలు కొన్ని సందర్భాలలో ప్రజల జీవితాలను బాగు చేయడానికి బదులు వారి జీవితాలతో చెలగాటమాడుతాయి. అనుకున్నదొకటి జరిగింది వేరొకటి అన్నట్టుగా కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్ పథకం ఓ గ్రామంలో ఓ పేదవాడి జీవితాన్ని, ఆ కుటుంబాన్ని ఏ విధంగా విపత్తుల పాలు జేసింది?, వారి ప్రశాంతమైన జీవితాలను ఏ విధంగా అల్లకల్లోలం చేసిందీ అనే ఇతివత్తంతో రూపొందిన చిత్రమే ‘భీమదేవరపల్లి బ్రాంచ్’. యువదర్శకుడు రమేష్ చెప్పాల దర్శకత్వంలో కీర్తిలతబత్తిన, రాజా నరేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23వ తేదీన విడుదల కానుంది.
ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ చేస్తున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ, ఉత్కంఠభరితమైన మలుపులతో, ఎమోషనల్‌గా సాగే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందింది.
చిత్ర నిర్మాత కీర్తిలత మాట్లాడుతూ, ‘జరుగుతున్న సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్రం ద్వారా ప్రజలు కాస్తయినా జాగ్రత్త పడతారు. ప్రభుత్వ పథకాలు పేరిట ఎదుర్కొనబోతున్న సమస్యల సుడిగుండాలలో చిక్కుకుని జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకోకుండా పథకాల పట్ల పరిజ్ఞానం పెంచుకుంటారనే సదుద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని నిర్మించాం’ అని అన్నారు.
‘పేపర్‌లో వచ్చిన ఒక వార్తను చదివి ప్రభావితమై వినోదాంశాలతో మేళవించి, ప్రభుత్వపథకాల రూపంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించడానికే సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాను. ప్రేక్షకులు ఈ చిత్రం ద్వారా పథకాల వెనుక జరుగుతున్న అవకతవకలను తెలుసుకుంటారనే సంకల్పంతోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు. ‘బలగం’ చిత్రంలో నటించి పాప్యులారిటీ సాధించిన కొందరు నటీనటులు, కొత్తనటులు మరికొందరితో ఈ చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించామని నిర్మాతలలో ఒకరైన రాజా నరేంద్ర కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలే వరంగల్ జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌తో ఈ చిత్రానికి ఊహించని క్రేజ్ వచ్చింది.
అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్), రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్ (బీ.ఎస్), శుభోదయం సుబ్బారావు, గడ్డం నవీన్, వివ రెడ్డి, సి ఎస్ ఆర్, నర్సింహ రెడ్డి, పద్మ, మానుకోట ప్రసాద్, తాటి గీత, విద్యా సాగర్, మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, బైరన్న కటారి, రజిని, సుష్మా.
తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కె.చిట్టి బాబు, సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.సంజరు మహేష్ వర్మ, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి.