రుణాలను రీ షెడ్యూల్‌ చేయకపోతే సొసైటీని ముట్టడిస్తాం

If the loans are not rescheduled we will besiege the society–  రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య
నవతెలంగాణ – జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సొసైటీ పరిధిలో ఉన్న 4వేల మంది రైతులకు ఈ ఏడాది రుణాలు రెగ్యులర్‌ చేయకపోవడం వల్ల 14 శాతం పడుతున్న వడ్డీ.. రైతులకు భారమని, వెంటనే పాలకవర్గం రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని, లేకుంటే ఈ నెల 14న సొసైటీ ఆఫీస్‌ని ముట్టడిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య హెచ్చరించారు. మంగళవారం మండలంలోని నరసాపురంలో జరి గిన రైతు సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకవైపు ప్రభుత్వాలు రైతు రుణాలు మాఫీ చేస్తామంటున్న ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా స్థానిక పాలకవర్గం రైతులకు అదనపు భారాలు మోపే విధంగా చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. ఈ నెల 15వ తేదీ వరకు రుణాలు రీ షెడ్యూల్‌ చేయకపోతే ఏడు శాతం ఉన్న వడ్డీ రేటు 14శాతం పెరిగే అవ కాశం ఉందని, అలా పెరిగితే రానున్న కాలంలో రైతులపై విపరీతమైన వడ్డీ రేటు పెరిగి అప్పు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే సుమారు రూ.90 లక్షలు.. సొసైటీకి నిధులు వచ్చినప్పటికీ వాటిని మురగపెట్టి రైతు లకు రుణాలివ్వకుండా, రుణాలు రీ షెడ్యూల్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవ హరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అన్ని రకాల రుణాలను తక్షణం రద్దుచేసి కొత్త రుణాలు అందించి రైతాంగంను ఆదుకోవా లని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, రైతు సంఘం మండల అధ్యక్షులు గోవిందు నాయకులు, వల్లమళ్ల చందర్రావు, లకావత్‌ శ్రీను, బానోత్‌ ఈశ్వర్‌, సాంబశివరావు, కనికి రత్నం తదితరులు పాల్గొన్నారు.