మంత్రి గారూ…హామీలు నెరవేర్చకపోతే

– ఈ నెల 15 నుంచి సమ్మెతోసహా ఆందోళనలు : గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పంచాయతీరాజ్‌ శాఖ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఈనెల 15 నుంచి సమ్మెతోసహా ఆందోళనలు నిర్వహించాలని గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఆలోపు మంత్రి కలవాలని నిర్ణయించింది. కార్మికుల డిమాండ్లపై మంత్రి ఆదేశాలు ఇస్తే కార్మికులకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. ‘చేస్తాం…చూస్తాం’ అని హామీ ఇస్తే అంగీకరించేది లేదని పేర్కొంది. ఈనెల 16 లోపు డిమాండ్లను పరిష్కారం చేస్తూ జీవోలను జారీ చేయకపోతే, అదే రోజు నుంచి ఆందోళన చేయాలని సమావేశం నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌ అధ్యక్షతన గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో జేఏసీ సలహాదారులు యండి. యూసఫ్‌, కె. సూర్యం (ఐఎఫ్‌టీయూ), కన్వీనర్లు, కో కన్వీనర్లు గ్యార పాండు, పాలడుగు సుధాకర్‌ (సీఐటీయూ), నర్సింహారెడ్డి, జయచంద్ర (ఏఐటీయూసీ), పి. అరుణ్‌ కుమార్‌, కూర్మయ్య (ఐఎఫ్‌టీయూ), పి. శివబాబు, యాదయ్య (ఐఎఫ్‌టీయూ), వెంకన్న (ఐఎఫ్‌టీయూ) తదితరులు పాల్గొన్నారు. అందుకు గ్రామ పంచాయతీ ఉద్యోగులంతా సన్నద్ధం కావాలని జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ ప్రధాన కార్యదర్శిగా యండి. యూసఫ్‌ (ఏఐటీయూసీ)ను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
కార్యాచరణ ఇలా…
ఈనెల 15, 16 తేదీల్లో మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్‌ వద్ద ధర్నాలు
20, 21, 22, 23 తేదీల్లో డిమాండ్‌ బ్యాడ్జీలు ధరించి, ప్రజల నుంచి సంతకాల సేకరణ
21 మళ్ళీ సమ్మె నోటీసు ఇవ్వాలి.
22 నుంచి 24 వరకు జిల్లాల్లో డీపీఓ, కలెక్టర్లకు సమ్మెలోకి వెళ్తున్నట్టు వినతిపత్రాలు
25,26,27 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో మూడు రోజులు ధర్నాలు – సభలు
అక్టోబర్‌ 1న 20 వేల మందితో చలో హైదరాబాద్‌
అక్టోబరు 2 నుంచి మళ్లీ రాష్ట్రవ్యాప్త సమ్మె,