నవతెలంగాణ- చండూరు: నామినేషన్ దాఖలు ప్రక్రియలో భాగంగా ఓ నిరుద్యోగి చండూరులో భిక్షాటన చేసి నామినేషన్ వేసిన సంఘటన ప్రజలను ఆలోచింప జేసింది. మునుగోడు మండలం సత్యనారాయణ మాట్లాడుతూ… తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారుతాయని ఆమరణ నిరాహారదీక్ష చేశామని తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యోగాలు లేక యువత బిచ్చగాళ్లుగా మారారన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇంటికో కాటన్ మద్యం సప్లయ్ చేస్తుండు అని ఆరోపించారు. కేసీఆర్ ను రాజకీయ నిరుద్యోగిగా మార్చే వరకు పోరాటం చేస్తామని గజ్వేల్, కామారెడ్డిలో నిరుద్యోగులం కలిసి ఓడగొడతామని తెలిపారు. ఉద్యోగాలు నింపటానికి అనేక అడ్డంకులు పెడుతున్న ప్రభుత్వం లిక్కర్ కు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా రెండు నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. గజ్వేల్, సిద్దిపేట లాగా మునుగోడును ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఓటేస్తే బిచ్చగాలు అవుతారని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందాలో కోట్లు సంపాదించవచ్చుకాని మాకు ముప్పై వేల ఉద్యోగాలు వద్దా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు కావాలంటే కేసీఆర్ కు ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు.