జిల్లాలో 55 మంది అభ్యర్థులు…. 82సెట్లు

నవతెలంగాణ- సిరిసిల్ల
శాసనసభ ఎన్నికలు ఈనెల 30న ఉండడంతో ఈనెల మూడు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించింది శుక్రవారం కు నామినేషన్ ప్రక్రియ ముగిసింది దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 55మంది అభ్యర్థులు82 సెట్లు వేశారు సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిత్వానికి 23 మంది అభ్యర్థులు 43 సెట్లు వేశారు అలాగే వేములవాడ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిత్వానికి 22మంది అభ్యర్థులు 39సెట్లు వేశారు.
ఆఖరి రోజు అత్యధిక నామినేషన్లు
నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం కు ముగియడంతో అత్యధిక నామినేషన్లు పడ్డాయి సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిత్వానికి శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా జంగిడి మధు నక్క హరీష్ అన్నారం సాయికుమార్ కోడూరి బాలలింగం కటకం మృత్యుంజయం బుసపురం ప్రవీణ్ కుమార్ నామినేషన్లు వేయగా బిజెపి అభ్యర్థిగా రాని రుద్రమరెడ్డి విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా లగిశెట్టి శ్రీనివాస్ శివసేన అభ్యర్థిగా గౌటే గణేష్ బిఎస్పి అభ్యర్థిగా పిట్టల భూమేష్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పత్తిపాక సురేష్ రుద్రమ తరపున గరిబెల్లి ప్రభాకర్ కే తారకరామారావు తరపున బొల్లి రామ్మోహన్ ఆర్పిఐ అంబేద్కర్ అభ్యర్థిగా పల్లికొండ నరసయ్య ఆర్పిఐ ఆతేవాలే అభ్యర్థిగా రెడ్డి మల్ల శ్రీనివాస్ ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా దోశల చంద్రం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ధ్యాపదేవయ్యలు శుక్రవారం నామినేషన్లు వేశారు.

Spread the love