ఈ టిప్స్‌ ఫాలో అయితే..

If you follow these tips..ఆకుకూర అంటేనే పోషకాల పవర్‌హౌస్‌. తోటకూర, పాలకూర, మెంతి, బచ్చలి, గోంగూర.. లాంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్‌, ఫోలేట్‌, ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉన్న ఫైబర్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిలోని సి, ఇ విటమిన్లు, బీటా కెరొటిన్‌ కంటిచూపును మెరుగుపరుస్తాయి, యాంటీఆక్సిడెంట్లు గాయాలను తగ్గిస్తాయి. అయితే, కొన్ని సార్లు ఫ్రిజ్‌లో పెట్టినా.. ఆకుకూరలు పాడవుతూ ఉంటాయి. కొన్ని సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే, ఆకుకూరలను ఎక్కువ రోజులు స్టోర్‌ చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
టవల్‌లో చుట్టండి..
ఆకుకూరలు త్వరగా పాడవ్వడానికి ముఖ్యమైన కారణం.. అధిక తేమ. మీరు ఆకుకూరలను స్టోర్‌ చేసుకోవడానికి, ముందుగా ఆకులు పొడిగా ఉండేలా చూసుకోండి. దెబ్బతిన్న, చెడిపోయిన ఆకులను క్లీన్‌ చేయండి. ఆ తర్వాత శుభ్రమైన క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్‌లో పెట్టండి. ఇలా చేస్తే.. ఆకుకూరలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
న్యూస్‌ పేపర్‌ వాడండి..
మీరు ఆకుకూరలు కొన్న తర్వాత.. ముందుగా వాటిలోని చెడిపోయిన ఆకులను తీసి క్లీన్‌ చేయండి. ఆ తర్వాత, కాడలు కత్తిరించండి. వీటిని న్యూస్‌ పేపర్‌లో పెట్టి రోల్‌ చేయండి. ఈ రోల్‌ను జిప్‌-లాక్‌ బ్యాగ్‌లో ఉంచండి. సీల్‌ చేసే ముందు బ్యాగ్‌ నుంచి లోపల గాలి లేకుండా చూసుకోండి. ఈ బ్యాగ్‌ను రిఫ్రిజిరేటర్‌లో స్టోర్‌ చేయండి. ఇలా చేస్తే ఆకుకూరలు వారం అంతా ఫ్రెష్‌గా ఉంటాయి.
పండ్లకు దూరంగా పెట్టండి..
యాపిల్స్‌, అరటిపండ్లు, కివీస్‌ వంటి పండ్లు ఇథిలీన్‌ గ్యాస్‌ను రిలీజ్‌ చేస్తాయి. ఇది పండ్లు, కూరగాయలు సహజంగా పండించడానికి సహాయపడుతుంది. బచ్చలికూర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఇథిలీన్‌ గ్యాస్‌ రిలీజ్‌ చేసే పండ్లకు దూరంగా గాలి చొరబడని కంటైనర్‌లో స్టోర్‌ చేయాలి.