ఈ టిప్స్‌ ఫాలో అయితే

స్కిన్‌ కేర్‌ అనేది ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉంటుంది. మీరు ఏ వయసు వారైన స్కిన్‌ కేర్‌ అనేది ఫాలో అవ్వాలి. వద్ధాప్యం అనేది సహజ ప్రక్రియ. దీనిని మనం ఆపలేం. కానీ, సరైన స్కిన్‌ కేర్‌తో వద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్‌ ఏంటో తెలుసుకోండి.
సీరమ్‌..
ముప్పైలలో స్కిన్‌ని ఎక్స్‌ఫోలియేట్‌ చేయడం ముఖ్యం. ఇది చర్మంలోని మతకణాలను తొలగించి చర్మాన్ని పునరుద్ధరించడంలో సాయపడుతుంది. ఇది చర్మాన్ని మదువుగా, కాంతివంతంగా మార్చడంలో సాయపడుతుంది. వారానికి ఓసారి ఇలా చేయడం మంచిది. దీనికోసం ఓట్స్‌, బియ్యంపిండి, శనగపిండితో ఎక్స్‌ఫోలియేట్‌ చేయొచ్చు.
మాయిశ్చరైజర్‌..
మాయిశ్చరైజర్‌ చర్మానికి చాలా ముఖ్యం.. దీనిని ఎప్పుడూ స్కిప్‌ చేయొద్దు. వయసు పెరిగే కొద్దీ స్కిన్‌ డ్రై అవుతుంది. కాబట్టి, దీనిని తగ్గించేందుకు మాయిశ్చరైజర్‌ రాయాలి. ఉదయం, సాయంత్రం రాయాలి. గ్లిజరిన్‌ ఉన్న మాయిశ్చరైజర్‌ మంచిది. కలబంద, కొబ్బరి నూనె కూడా మంచిది.
సన్‌స్క్రీన్‌..
ఏ వయసు వారైనా సన్‌స్క్రీన్‌ చాలా ముఖ్యమైంది. దానిని అస్సలు మర్చిపోవద్దు. ఇది సూర్య కిరణాల నుండి స్కిన్‌ని కాపాడుతుంది.
నీరు తాగడం..
అన్ని వయసుల వారికి నీరు తాగడం మంచిది. జుట్టు, చర్మానికి చాలా అవసరం. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌తో పాటు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. హైడ్రేటెడ్‌ స్కిన్‌ కోసం రోజుకి 7 నుంచి 8 గ్లాసు నీరు తాగాలి. షుగర్‌ డ్రింక్స్‌ తగ్గించాలి.