హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన తారాగణంగా ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా బ్యానర్స్‌పై కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘సుందరం మాస్టార్’. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. సోషల్ స్టడీస్ చెప్పే ఓ గవర్నమెంట్ టీజర్ ఇంగ్లీష్ చెప్పాల్సి వస్తే ఏం జరిగింది అనేదే ఈ సినిమా.
ఈ సినిమా టీజర్‌ను హీరో సాయితేజ్ విడుదల చేశారు.
వైజాగ్‌లో జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో సాయితేజ్ మాట్లాడుతూ, ‘సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్ చేయటానికి ఐదు కారణాలు, అక్షర, రమ, రావు మొదటి మూడు కారణాలు. హర్ష వాళ్లబ్బాయే. తను బాగా నటిస్తాడు. ఇక నాలుగో కారణం.. నా ఫేవరెట్ హీరో రవితేజ. ఐదో కారణం.. ప్రేక్షకుల ప్రేమను పొందడానికే వచ్చాను. మంచి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. అందర్నీ కచ్చితంగా మెప్పిస్తుంది’ అని తెలిపారు. ‘నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్స్. నాకు ఇది చాలా ఎమోషనల్ మూమెంట్’ అని హర్ష చెప్పారు. దర్శకుడు కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ, ‘ఓ మంచి కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. నిర్మాతల సహకారం అద్భుతం’ అని తెలిపారు.