ఐదేళ్ల అభివృద్ధి నచ్చితే ఆదరించండి

– వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలో ఐదేళ్ల అభివృద్ధి నచ్చితే తనను ఆదరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో క్రిస్టియన్‌ సోదరుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అతిథిగా పాల్గొని ప్రసం గించారు.రాష్ట్రం సుభి క్షంగా ఉందని, ప్రతి ఇంటికి పింఛన్‌ , సంక్షేమ పథకాలు , వైద్య రంగంలో విప్ల వాత్మక మార్పులు వచ్చాయన్నారు. ”మా పాలన మాకు కావాలి మేము అభివద్ధి చేసుకుంటాం” అని ఉమ్మడి రాష్ట్రంలో పాలకులను వ్యతిరే కించా మన్నారు. తెలంగాణ ప్రజలందరూ మా కుటుం బ సభ్యలేనని చెప్పారు. అవకాశం ఉన్న చోట అంద రికి రాజకీయ అవకాశాలు కల్పిస్తు న్నామన్నారు. మాట ఇస్తే అందుకు కట్టుబడి ఉంటానని, ప్రాణం పోయినా మాట తప్పనని నిరంజన్‌ రెడ్డి చెప్పారు. అభివద్ధి చేస్తున్నామని, భవిష్యత్తు లో మరింత అభివద్ధి చేసే దిశలో మీరంతా భాగ్యస్వా ములు కావాలని మంత్రి కోరారు. అన్ని మతాల అభివద్ధి కోరుకునేవాడే నిజమైన నాయకుడన్నారు. క్రైస్తవ సోదరుల కోరిక మేరకు సమాధుల స్టలం ఇవ్వడం జరిగిందన్నారు. అవకాశం ఉన్న ప్రతి పనిని చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రెవరండ్‌ పాస్టర్‌ ఐసక్‌, రెవ,, కే, టి,బెంజమేన్‌, ఆర్‌, ప్రభాకర్‌, ఆర్‌, శాస్త్రి, ఎన్‌, చెంద్రశేఖర్‌, జై, వి, ఆర్‌, నాగభూ షణం, పౌలు, రీజనల్‌ అథారిటీ సభ్యులు ఆవుల రమేష్‌ , పార్టీ ప్రధాన కార్యదర్శులు, గంధం, పరంజ్యోతి, గంధంవిజరు కుమార్‌ పాల్గొన్నారు.