50వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధిస్తా

– ప్రభుత్వ చీఫ్‌విప్‌, పశ్చిమ అభ్యర్థి దాస్యం వినరుభాస్కర్‌
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నన్ను బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషకరమని, ప్రజలు కూడా అలాగే ఆదరిస్తున్నారని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం లోని కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రభుత్వ చీప్‌ విప్‌ దాస్యం వినరు భాస్కర్‌ అన్నారు. ఏ వాడకెళ్ళిన గల్లీ కెళ్ళిన డివిజన్‌ కెళ్ళిన ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నారు. ప్రతిచోట లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎందరో ఉన్నారని, పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందిస్తున్నామన్నారు. ఏ వత్తిలో ఉన్న వారికైనా, వివిధ రకాల పెన్షన్ల వారికైనా అనేక అభివృ ద్ధి ఫలాలు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది, సీఎం కేసీఆర్‌దన్నారు. ప్రతి చోటా ఆత్మీయంగా పలకరించి వారి ఇంట్లోమనిషిగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. కెసి ఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుప డుతుందని, వేరే ఏ ఇతరులు వచ్చినా రాష్ట్రంలో అభివద్ధి కుంటుపడుతుందన్నారు. 2009నుండి ఇప్పటివరకు కేసీఆ ర్‌కు నమ్మకంగా వారికి తోడుగా పనిచేస్తున్నానని, డివిజన్‌ అధ్యక్షుడు కార్పోరేటర్‌, పశ్చిమ నియోజకవర్గ ప్రజాప్రతిని ధులు ఎంతగానో పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యలు తీర్చడానికి ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. గతంలో కంటే ఈసారి మరింత మెజారిటీతో అనగా 50వేలకు పైచి లుకు మెజార్టీతో గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేశారు. రెట్టిం పు ఉత్సాహంతో అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తూ కా ర్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానన్నారు. కరో నా కష్టకాలంలో,వరదలు వచ్చినప్పుడు కూడా ప్రజలకు అం దుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించడానికి నావంతు బాధ్యతగా కృషి చేశానన్నా రు. చేయికి ఓటేస్తే రైతులకు ఇబ్బందికర పరిస్థితులుకాంగ్రెస్‌ వా ళ్ళకు అధికారం ఇస్తే కుక్కలు చెప్పిన ఇస్తారే.రాష్ట్ర ప్రణాళికా సంఘంఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ మీడియా సమావేశాన్ని ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు లు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి శాసనసభ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారం లోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.
అలాగే మలిదశ ఉద్యమానికి ఆలోచనకు పురుడు పో సిన వరంగల్‌ మహానగరం, తెలంగాణ ఉద్యమానికి కేయూ కూడా ఎంతగానో కృషి చేసిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తె లంగాణ రాష్ట్రం దగాపడ్డదని, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కో సం ఆ రోజున 2001లో గులాబీ జెండాను ఆవిష్కరించి రాజకీయ ఉద్యమ పార్టీగా అవతరించి, నీళ్లు నిధులు నియా మకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రాష్ట్రం సాధించేవరకు అనేక కార్యక్రమాలు చేశామన్నా రు. హనుమకొండ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశానని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐదుగురు ఎంపీలు,32 పార్టీల దగ్గరికి తిరిగి 88 మందిని ఒప్పించి తెలంగాణకు సానుకూలంగా ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లెటర్లు ఇచ్చామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్‌ సుందర్‌ రాజు యాద వ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజిజ్‌ ఖాన్‌, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ జనార్దన్‌ గౌడ్‌, స్థానిక కార్పొరేటర్‌ చీకటి శారద, మైనారిటీ నాయకులు నయీము ద్దీన్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.