ఐకేపీ వీవోఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలి

– సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఐకేపీ వీవోఏలను సెర్స్‌ ఉద్యోగులుగా గుర్తించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. ఉద్యోగ భద్రత, రూ.10 లక్షల బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని తెలిపారు. గుర్తింపు కార్డులివ్వాలని, అర్హులైన వీవోఏలను సీసీలుగా పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇతర న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.