సమావేశం ఏర్పాటు చేసుకుందామంటే నాయకులను అరెస్టు చేస్తారా
ఇదెక్కడి న్యాయం?
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
వర్గ సభ్యులు జాన్ వెస్లీ
నవతెలంగాణ- కందుకూరు
ఇళ్ల స్థలాల కోసం సర్టిఫికెట్లు ఇచ్చిన వారితో సీపీఎం నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకుందామంటే నాయ కులను శుక్రవారం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం.. ఇదెక్కడి న్యాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ ప్రభుత్వంపై మండిపడా ్డరు. కందుకూరు మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 778లో ఇళ్ల స్థలాల లబ్దిదారులతో పార్టీ మండల కార్యదర్శి బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న నాయకులు సీపీఐ (ఎం) నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలిం చారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ పోలీసులు తప్పుడు సమాచారం తెలుసుకొని తమ నాయకులను అరెస్టు చేసి ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించడం సరైంది కాదన్నారు. పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్, మహేశ్వరం పోలీస్ స్టేషన్లకు తమ నాయకులను తరలించారని తెలిపారు. సమావేశం ఎక్కడైనా నిర్వహించడానికి అందరికీ అవకాశం ఉందని, ఈ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని హి తువు పలికారు. ఇది హక్కులకు భంగం కలిగించడమే అవుతుందన్నారు. పోలీస్ బెటాలియన్‌తో మహిళలను అని చూడకుండా, భయాందోళన గురిచేసే పద్ధతిలో పోలీసుల ప్రవర్తన ఉందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండించారు. కందుకూరు మండల కేంద్రంలో 2007లో 185 మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం అప్పటి ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇస్తే, నేటికీ కబ్జా చూపలేదని విమర్శించారు. దీంతో వారు ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదల పైన ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. అరెస్టు చేసిన నాయకుల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో మండల కార్యద ర్శి బుడ్డీరపు శ్రీనివాస్, గుడిసెల పోరాట సంఘం అధ్యక్షులు రాయికంటి శేఖర్, నాయకులు గాదె సత్తయ్య, గాదే కుమార్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్, మండల కమిటీ సభ్యులు ఏ, కుమార్, బుట్టి బాలరాజ్, ఎడ్ల నరసింహ, అరుణ, తదితరులు పాల్గొన్నారు.