అక్రమ అరెస్టులను నిలిపివేయాలి..

నవతెలంగాణ- రెంజల్

ప్రజాస్వామ్యంలో తమ స్వేచ్ఛకు భంగం కలిగించి అక్రమ అరెస్టులను నిలిపివేయాలని రెంజల్ మండల బిజెపి నాయకులు స్పష్టం చేశారు. సోమవారం టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో హామీలను మరిచిందని కోరుతూ కలెక్టరేట్ కు వెళ్లకుండా ముందు జాగ్రత్త నాయకులను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. సోమవారం ఉదయమే బిజెపి నాయకులైన గోపికృష్ణ, హనుమాన్లు (బుజ్జి) లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.