– దళిత, ప్రజా సంఘాల డిమాండ్
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలోని చింతగట్టు శివారులోని మునిపెల్లి గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 438/ఎలో ఉన్న నిరుపేద దళితులైన గోళ్ల రామస్వామి, మల్లయ్య, పర్వతాలు కుటుంబాలకు చెందిన పట్టాభూమిని అక్ర మంగా పట్టా చేసుకొని దౌర్జన్యంగా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సూరం రాజేందర్‌రెడ్డి, సూరం నరేందర్‌రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు చుంచు రాజేందర్, కేడల ప్రసాద్, కలకోటి మహేందర్, అం కేశ్వర రామచంద్రరావు, సింగారపు రవిప్రసాద్, తెలంగాణ కొమురయ్యలు డిమాండ్ చేశారు. మంగళవారం మునిపెల్లి గ్రామంలోని దళితుల భూములను కబ్జాకు గురిచేయాడానికి ప్రయత్నం చేస్తున్న దళితు ల భూములను సామాజిక దళిత, బీసీ, ప్రజాసంఘా ల నాయకులు బాధితుల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిపెల్లి గ్రామానికి చెందిన సూరం లచ్చిరెడ్డి గత 50 సంవత్సరాల క్రితం అతనికి చెందిన సర్వే నెంబర్ 438/ఎ లోని 3-18 ఎకరాల భూమిని దళితుడైన గోళ్ళ రామస్వామి, పర్వాతాలు, అయుల య్య, మల్లయ్య ఇచ్చి ఇతనికి చెందిన చెందిన సర్వే నెంబర్ 438లోని 3ఎకరాల భూమిని బదులు రూప కంగా తీసుకున్నారని, మిగిలిన 18గుంటలకు డబ్బు లు తీసుకున్నాడని దీనికి సంబంధించిన పత్రాలు ఉ న్నాయన్నారు. నాటి నుండి సదరు సర్వేనెంబర్ లోని మొత్తం 3-18ఎకరాల్లో దళితులైన గొల్ల రామస్వా మి, పర్వాతాలు, మల్లయ్య, అయిలయ్యలు సాగు చే సుకుంటూ మామిడిపండ్ల మొక్కలను కూడా నాటా రని ఈ భూమిపై కన్నేసిన అగ్రకుల రెడ్డిలైన సూరం రాజేందర్‌రెడ్డి, సూరం నరేందర్ రెడ్డిలు అక్రమంగా పట్టా చేసుకొని బలవంతంగా కబ్జాచేసే ప్రయత్నా లు చేస్తున్నారని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తో పాటు పీడియాక్టు నమోదు చేసి కఠినంగా శిక్షిం చాలని వారికి సహకరించిన స్థానిక రెవెన్యూ అధికా రులను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. నిరుపేద దళితులైన గోళ్ల రామస్వామి అన్న దమ్ముల భూములను జిల్లా ఉన్నతాధికారులైన కలెక్ట ర్, సిపీలు దృష్టిసారించి భూ కబ్జాదారులు అక్రమం గా పట్టాచేసుకున్న పట్టాదారు పాసు బుక్కులను ర ద్దుచేసి, భూ బాధితులకు సదరు భూమిని అప్పగించి న్యాయం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపకులు కలకోట మహేందర్, అఖిల భారత మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రామచంద్రరావు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్య దర్శి సింగారపు రవిప్రసాద్, బిఎల్‌ఎఫ్ జిల్లా అధ్యక్షు డు ఐతం నగేష్, తెలంగాణ ఉద్యమకారుడు దామెర కొండ కొమురయ్య, డిబిఎఫ్‌జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్, జిల్లా కార్యదర్శి చుంచు నరేష్‌తో పాటు భూ బాధితులు గొళ్ళ సరోజన, గొళ్ళ మల్లయ్య, గోళ్ళ ఐల మ్మ, గొళ్ళ పర్వతాలు, గొళ్ళ కనక లక్ష్మి, గోళ్ళ రా జేంద ర్, శ్రీనివాస్,సురేష్, రాజన్‌బాబు, దళిత, ప్రజాసం ఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.