
మండలం లోని పచ్చల నడుకుడ పెద్దమ్మ ఆలయం వద్ద హైమస్ లైట్లను ZPTC భారతి రాకేష్ చంద్ర, నాయకులు ప్రారంభించారు .. ఈ సందర్భంగా జెడ్పిటిసి భారతి రాకేష్ చంద్ర మాట్లాడుతూ గతంలో జెడ్పి నిధులు ,స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాలలో 10 హైమాస్ లైట్లను పెట్టించడం జరిగిందని అన్నారు.. అదేవిధంగా వేల్పూర్ మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు వాటర్ ట్యాంక్ వద్ద ఒకటి, పచ్చల నడుకుడ ప్రైమరీ స్కూల్ వద్ద ఒకటి, మార్కెట్ సంత వద్ద ఒకటి, గొల్ల కంతలో ఒకటి అదేవిధంగా పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఒక హైమాస్ లైట్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు… ఇవే కాకుండా మండలంలోని మరికొన్ని గ్రామాలలో అవసర నిమిత్తం హైమస్ లైట్ల కొరకు ప్రపోజల్ పంపడం జరిగిందని తెలిపారు… ఇందుకు సహకరించిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు… పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద హైమాస్ లైట్ ను మంజూరు ఇప్పించి ఏర్పాటు చేసినందుకు జెడ్పిటిసి భారతి రాకేష్ చంద్రకు ముదిరాజ్ సంఘం తరపున, ఆలయ కమిటీ అధ్యక్షులు బోండ్ల గంగ భూమన్న, జానా ముత్యం కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు… అనంతరం జడ్పిటిసి భారతీయు ఆఫీస్ చంద్ర కు శాలువా పూలమాలతో ముదిరాజ్ సంఘం సభ్యులు సన్మానించారు…. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు శ్వేతా గంగారెడ్డి,జడ్పిటిసి భారతీ రాఖీ చంద్ర, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలేటి రమేష్, ఎంపీటీసీలు నోముల గంగారెడ్డి, గుడాల గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు బోండ్ల భూమన్న, జానముత్యం, వార్డ్ సభ్యులు గోజా నరేందర్, జాపిరి ప్రకాష్, లొక్కిడి చిన్న సాయిలు, ఈదుల రమేష్, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.