నవంబర్ 3 నుండి నవంబర్ 16 వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి
నవతెలంగాణ -కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ మూడో తేదీ నుండి నవంబర్ 16వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు -2023 షెడ్యూల్డు తేది: 30-11-2023 ఉన్నందున ఎన్నికల నోటిఫికేషన్ తేది: 03-11-2023 నుండి తేది: 10-11-2023 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అమలులో ఉన్న సందర్భంగా మరియు తేది: 15-11-2023న అభ్యర్ధులు విత్ డ్రా ఉన్న సందర్భంగా పలు ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలియజేశారు. 011 ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ నోటిఫికేషన్ నామినేషన్ స్వీకరణ  రిటర్నింగ్ ఆఫీసర్ తైసిల్ ఆఫీస్ ఆర్మూర్. 012 బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ నోటిఫికేషన్ నామినేషన్ స్వీకరణ  రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ (R.D.O )బోధన్. 017 నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం – అసెంబ్లీ నోటిఫికేషన్ నామినేషన్ స్వీకరణ రిటర్నింగ్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్ న్యూ బిల్డింగ్ నిజామాబాద్. 018 నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం – అసెంబ్లీ నోటిఫికేషన్ నామినేషన్ స్వీకరణ రిటర్నింగ్ ఆఫీసర్ R.D.O ఆఫీస్ (పాత మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ బిల్డింగ్) నిజామాబాద్. 019 బాల్కొండ – అసెంబ్లీ నియోజకవర్గం – అసెంబ్లీ నోటిఫికేషన్ నామినేషన్ స్వీకరణ : రిటర్నింగ్ ఆఫీసర్, ఎమ్.పి.డి.ఓ ఆఫీస్, భీంగల్ అని తెలిపారు.కావున ఈ ప్రదేశాలలో 500 మీటర్ల దూరంలో 5 మంది కన్న ఎక్కువ మంది గుమికూడవద్దు. ఈ పరిసర ప్రాతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.ఎవ్వరయిన పై నిబంధనలు ఉల్లంఘించినచో వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొనబడును అని తెలియజేశారు. ఇట్టి సూచనలు తేది: 03-11-2023 ఉదయం 6 గంటల నుండి తేది: 16-11-2023 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉండును అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలియజేశారు.