లిల్లీపుట్ పాఠశాలలో ఆకట్టుకున్న స్వాతంత్ర దినోత్సవ సంబరాలు

విశేషంగా ఆకట్టుకున్న  చిన్నారులు
విశేషంగా ఆకట్టుకున్న చిన్నారులు
నవతెలంగాణ ఆర్మూర్
లిల్లీపుట్ పాఠశాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గేయాలు, ఉపన్యాస పోటీలు విద్యార్థులు చక్కగా పాల్గొన్నారు తదనంతరం వీరికి పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చిన్నారులందరు దేశనాయకులగా అలంకరించుకొని వచ్చి అలరించారు. రాణి రుద్రమదేవి, భరతమాత, అంబేద్కర్ ఇలా పలుగురు స్వతంత్ర సమరయోధుల వేషాలతో పిల్లలు విశేషంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పిరమిడ్ తో విద్యార్థులందరూ భరతమాతకు చక్కగా సెల్యూట్ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులందరూ చక్కగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించుకోవాలని దేశాని కోసం ఏదో ఒక రూపంలో పని చేసే వ్యక్తులుగా విద్యార్థులు తయారు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.