యాదాద్రిలో సౌకర్యాలు మెరుగుపర్చండి

– దేవాదాయ శాఖపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆలయాల అభివద్ధి, దేవాదాయ భూములు సంరక్షణతో పాటు యాత్రీకులు సంతప్తి చెందేలా సౌకర్యాలు కల్పించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శనివారంనాడాయన దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగా చేపట్టిన ధూప దీప నైవేద్య పథకం వర్తింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కామన్‌ గుడ్‌ ఫండ్‌ నిధుల ద్వారా చేపట్టిన ఆలయాల అభివద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను దేవాదాయశాఖ తరపున ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అన్యాక్రాంతమైన దేవదాయశాఖకు చెందిన భూములను తిరిగి రాబట్టేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి ఇప్పటి వరకు 6,002 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కోర్టు కేసుల్ని త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఉద్యోగులు బాధ్యతయుతంగా పని చేయాలనీ, భక్తుల విశ్వాసాలను గౌరవించాలని చెప్పారు. యాదాద్రిలో భక్తులకు వసతులు మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, అదనపు కమీషనర్లు జ్యోతి, కష్ణవేణి, స్తపతి వల్లినాయగం తదితరులు పాల్గొన్నారు.