మూలధన వ్యయ కేటాయింపుల్లో

గుజరాత్‌ విఫలం : కాగ్‌ నివేదిక
అహ్మదాబాద్‌ : ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో అక్కడి బీజేపీ ప్రభుత్వం మూలధన వ్యయ కేటాయింపుల్లో విఫలమైందని కాగ్‌ పేర్కొన్నది. 2017 నుంచి 2022 మధ్య ఐదేండ్ల కాలంలో ఏ సంవత్సరంలోనూ మూలధన వ్యయం(క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌) కోసం బడ్జెట్‌ కేటాయింపులను పూర్తి చేయలేకపోయిందని తన ఫైనాన్స్‌ ఆడిట్‌ నివేదికలో వివరించింది. మూలధన వ్యయం అనేది భౌతిక, ఆర్థిక ఆస్థులలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం నియమించబడిన ప్రభుత్వ వ్యయాల భాగాన్ని సూచిస్తుంది. ఈ ఖర్చులు రోజువారీ కార్యాచరణ ఖర్చుల కోసం ఉపయోగిం చబడకుండా, కాలక్రమేణా ప్రయోజనాలను అందిం చే ఆస్తులను సృష్టించడానికి లేదా మెరుగుపరచడాని కి ఉద్దేశించబడతాయి. ఈ వ్యయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆస్తుల కల్పన, సామాజిక రంగ ప్రాజెక్టులు ఉన్నాయి. గాంధీనగర్‌లోని పీడీఈయూ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హిమానీ బాక్సీ మాట్లాడుతూ.. ” మూలధన వ్యయం తగ్గించబడినా లేదా ఉపయోగిం చకపోయినా, అది ఆస్తిని ఉత్పత్తి చేయదు. దీని కారణంగా ఉపాధి కల్పన కూడా తగ్గుతుంది. ప్రజలు ఉద్యోగాలు పొందకపోతే, వారు ఎలా ఖర్చు చేస్తారు?” అని అన్నారు. కాగ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ ఆడిట్‌ నివేదిక ప్రకారం.. గుజరాత్‌ మూలధన వ్యయం 2017-18లో రూ. 26,313 కోట్ల నుంచి 2021-22 నాటికి రూ. 28,185 కోట్లకు పెరిగింది.