విధానాల రూపకల్పనలో

డేటా అనాలిటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ కీలకపాత్ర :గవర్నర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విధానాల రూపకల్పన, దేశాభివృద్ధిలో డేటా అనాలిటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌దే కీలకపాత్ర అనిగవర్నర్‌ తమిళిసై అన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ సీఆర్‌ రావు అడ్వాన్స్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌లో శిక్షణ తీసుకుంటున్న ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీసెస్‌(ఐఎస్‌ఎస్‌) 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన ప్రొబెషనర్లను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. విధానపరమైన నిర్ణయాల్లో డేటా అనాలిటిక్స్‌ ప్రాధాన్యత ఉందన్నారు. యువ ప్రొబెషనరీ అధికారులతో గవర్నర్‌ చిట్‌చాట్‌ చేశారు. అల్యూమినీ డేటాను ఉపయోగించుకోవాలని సూచించారు. అల్యూమినీ డేటాను విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగ పడుతుందన్నారు. హెల్త్‌, న్యూట్రిషన్‌, గిరిజనల ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి సమగ్రమైన డేటాబేస్‌ను రూపొందించాలని సూచించారు.