మద్నూర్లో మళ్లీ మందలు మందలుగా కుక్కలు భయం గుప్పెట్లో ప్రజలు

నవతెలంగాణ- మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రతి గల్లీలో కుక్కలు మందలు మందలుగా సంతరించాయి కుక్కల మందలను చూసి గల్లి ప్రజలు భయం భయంగా ఉంటున్నారు. ఇటీవల ఒకేరోజు పిచ్చి కుక్కలు ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి ఒకరిని నిజామాబాదు తీసుకువెళ్లగా మరొక చిన్నారి పాపకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్సలు జరిపిస్తున్నారు. గాయపడ్డ వారు చికిత్సలతో కొట్టుమిట్ట లాడుతుండగా కుక్కల మందలు మళ్లీ సంతరిస్తున్నాయి. ఇలాంటి కుక్కలు మందలతో గ్రామ ప్రజలు భయం భయంగా తిరగవలసిన దుస్థితి ఏర్పడింది పిచ్చి కుక్కల దాడిలో ఒకేరోజు ఐదుగురు గాయపడ్డ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కుక్కలను పట్టుకుని తరలించే చర్యలుమరంగా చేపట్టినప్పటికీ పట్టిన కుక్కలు ఎక్కడ వదిలేశారు అనేది గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది కుక్కలను పట్టే వారు ఇక్కడ పట్టారు. కొంత దూరంలోనే వదిలేసినట్లు చర్చలు వినబడుతున్నాయి. వదిలి  పెట్టిన కుక్కలే మళ్లీ గ్రామంలోకి వచ్చినట్లు ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం వానాకాలం ఉరుములు మెరుపులతో వర్షాలు కురిస్తే మంచి కుక్కలు పిచ్చికుక్కలవుతాయని ప్రజల్లో వినికిడి మందలు మందలుగా కనిపించే కుక్కలు మళ్లీ ఏ రోజు ఎవరిపై దాడులు చేస్తాయో గ్రామ ప్రజల్లో భయం భయంగా ఉంది కుక్కల పట్ల గ్రామపంచాయతీ అధికారులు పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు కోరుతున్నారు.