– బుచ్చిబాబుని విచారించిన ఈడీ విచారణ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసును వీలైనంత త్వరలో కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు విచారణలో వేగం పెంచాయి. ఈ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును మరోసారి ఈడీ విచారించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి 6.15 గంటల వరకూ ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా.. ఈ కేసు విచారణలో బుచ్చిబాబు వాంగ్మూలం అత్యంత కీలకంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. గత వారంలో ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు తెలుగువారిని పిలిపించి ఈడీ ప్రశ్నించింది. బుచ్చిబాబు తరువాత ఈడీ ఎవరిని విచారణకు పిలుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.