– ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు కథనానికి సిపి స్పందన
– డీజే యాజమాన్యాలకు ముందస్తు నోటీసులు జారీ
నవతెలంగాణ- నవీపేట్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచార ఆర్భాటాలతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలతో ఈనెల 20వ తేదీన నవతెలంగాణలో ప్రచార ఆర్భాటంలో.. ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి జిల్లా కమిషనర్ కల్మేశ్వర్ శింగెనవార్ శనివారం స్పందించారు. ప్రచార ఆర్భాటంలో డీజేల అధిక సౌండ్ తో హఠాన్మరణాలు సంభవిస్తుండడంతో డీజే లను నియంత్రించేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సిపి ఆదేశాల మేరకు నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ డీజే యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలలో ఎటువంటి అనుమతులు లేకుండా డీజే లు ఉపయోగిస్తే వాహనాలతో పాటు సౌండ్ బాక్స్ లను సీజ్ చేస్తామని ముందస్తు నోటీసులు జారీ చేసి హెచ్చరించారు.