కొడికట్టిన అర్ధంలో….

In the narrow sense...మౌన కెరటమొకటి
ముఖాన్ని ఢ కొట్టి
మాట రుచి ఎటో కొట్టుకు పోయింది.

గీతలు పడ్డ గొంతులో
కోతపడ్డ శబ్దములో
కొడికట్టిన అర్ధంలో

చల్లపడ్డ స్పర్శ
నులివెచ్చని ఊహలో
తలచుకునే తేమలో

తడిసిన కల
వేకువ ఒడ్డుకు కొట్టుకొచ్చి
రాతి ముద్దగా మారింది..
– శ్రీ సాహితి, 9704437247