జాతీయ లోక్‌అదాలత్‌లో

In the National Lok Adalat–  5.58 లక్షల కేసుల పరిష్కారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జాతీయ న్యాయ సేవా సంస్థ మార్గదర్శకాల మేరకు శనివారం రాష్ట్రంలో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో భారీగా కేసులు పరిష్కారమయ్యాయి. ఈ మేరకు లీగల్‌సర్విసెస్‌ కమిటీ సభ్యకార్యదర్శి శనివారం ఒకప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టీస్‌ అలోక్‌ అరధే, న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ చైర్మెన్‌ జస్టీస్‌ పి సామ్‌ కోశీ, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మెన్‌ జస్టీస్‌ టి.వినోద్‌కుమార్‌ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా అన్నీకోర్టుల్లో లోక్‌అదాలత్‌లు నిర్వహించారు. హైదరాబాద్‌ సిటీ సీవిల్‌ కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌ను రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటీ చైర్మెన్‌ జస్టీస్‌ పి. సామ్‌కోశీ ప్రారంభించారు. లోక్‌అదాలత్‌ సందర్భంగా మొత్తం 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 13,179 ప్రీ-లిటిగేషన్‌ కేసులు, 55,704 పెండింగ్‌ కేసులు ఉన్నాయని సభ్యకార్యదర్శి తెలియజేశారు. ఈసందర్భంగా లబ్దిదారులకు రూ.180.10 కోట్లు పరిహారంగా అందజేశారు.